Cinema Gossips

కోలీవుడ్‌లో ఒక కొత్త క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేయడానికి ప్రయత్నాలు

కోలీవుడ్‌లో ఒక కొత్త క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. లిటిల్‌స్టార్‌ నుంచి క్రేజీ స్టార్‌ స్థాయికి ఎదిగిన ఈయన ఇటీవల నటనకు చిన్న గ్యాప్‌ తీసుకున్నారనే చెప్పాలి. ఈ గ్యాప్‌లో లండన్‌ వంటి విదేశాలు చుట్టొచ్చారు. అదేవిధంగా సమీప కాలంలో సరైన హిట్‌ను అందుకోలేదన్నది వాస్తవం. ఇక వివాదాలు ఈయనకు కొత్త కాదు. నయనతారతో ప్రేమ, నటి హన్సికతో పెళ్లి దాదాపు ఖయం అనుకున్న సమయంలో రివర్స్‌ అవడం శింబును సంచలన నటుడిగా మార్చాయని చెప్పవచ్చు. కాగా కోలీవుడ్‌లో మోస్ట్‌ బ్యాచిలర్‌ అనిపించుకుంటున్న శింబు ప్రస్తుతం తన మాజీ ప్రియురాలు హన్సిక 50వ చిత్రంలో అతిథి పాత్రలో నటించి పూర్తి చేశారు. ప్రస్తుతం మానాడు చిత్రంలో నటిస్తున్నారు

 Cinema Gossips
Hariyan Srinivas
 Cinema Gossips
Mar 05, 2020
  Cinema Gossips
Cinema Gossips