Crime News

పబ్బులో గొడవ..! రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.

సింగర్, బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది... హైదరాబాద్‌లోని ఓ పబ్బు దీనికి వేదికైంది. వివరాల్లోకి వెళ్తే.. సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం అర్ధరాత్రి సమయంలో వచ్చారు. అయితే, కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.. దీంతో, రాహుల్‌, ఆ యువకుల మధ్య మాటామాటాపెరగడంతో.. ఘర్షణ జరిగింది.. అనంతరం, ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగినట్టు సమాచారం. ఓ దశలో... యువకులు రాహుల్‌పై బీరు సీసాలతో దాడికి దిగారు.. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా... మరోవైపు తీవ్రగాయాలపాలైన రాహుల్... గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది.

 Crime News
Hariyan Srinivas
  Crime News
Mar 04, 2020
  Crime News
Crime News