Crime News

ఆ పాన్‌కార్డులు వాడితే 10వేలు జరిమానా !.

ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది. గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానించని వినియోగదారులపై చట్టం ప్రకారం చర్యలు తప్పవని తాజాగా హెచ్చరించింది. పాన్‌కార్డు పనిచేయకపోతే ఆర్థిక, బ్యాంకింగ్, ప్రాపర్టీ కొనుగోలు-అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్ల లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీని గడువును పలుమార్లు పొడగించిన ఐటీశాఖ..ఈసారి మాత్రం పొడగించే అవకాశం లేదని తెలుస్తోంది.

 Crime News
Hariyan Srinivas
  Crime News
Mar 04, 2020
  Crime News
Crime News