Political News

అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం-

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పేదలందరికీ ఇళ్లు పధకం లేఅవుట్ ను లబ్దిదారులు, అధికారులతో కలిసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది పేద వారికి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. కొంత మంది ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నివాసం ఉంటున్న, వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వాటిని తొలగించమని చెప్పడం జరిగిందన్నారు. ఆ ప్రకారమే ఈప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పంపిణీ చేసేందుకు లే-అవుట్ లో అభివృద్ధి పనులను ప్రారంభించారని తెలిపారు.ఎవరైనా దొంగ పట్టాలు తెస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 06, 2020
  Political News
Political News