Political News

మీ సత్తా ఎంతో, మా సత్తా ఎంతో తేల్చుకుందా – మంత్రి అనిల్

నెల్లూరు నగరంలోని చమండివారితోట నందు గల రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ సెంటర్ లో 13, 14, 15, 16, 40, 41, 42 డివిజన్ లకు సంబంధించి రూ.౩.62 కోట్లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్లు, డ్రెయిన్ లు, కల్వర్ట్ ల శిలాఫలకాన్ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేతలు వాయిదాకోసం కోర్టుకి వెళ్తున్నారని విమర్శించారు. సమస్య పరిష్కారం కోసమయితే గతంలోనే కోర్టు మెట్లెక్కేవారని, ఎన్నికలకు నెలరోజుల ముందు కోర్టుకి వెళ్లడం దేనికి సంకేతమని అన్నారు. వైసీపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని, మీ సత్తా ఎంతో, మా సత్తా ఎంతో తేల్చుకుందామని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పి.రూప్ కుమార్ యాదవ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, చాట్ల నరసింహా రావు, నూనె మల్లికార్జున, గోగుల నాగరాజు, మిద్దె మురళీకృష్ణ యాదవ్, వడ్లమూడి చంద్ర, అల్లంపాటి జనార్ధన్ రెడ్డి, తాటిపర్తి సునీల్, జంగాల కిరణ్ కుమార్, సిహెచ్. కుమార్, సుధీర్ (చిట్టి), లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, కిన్నెర ప్రసాద్, ధనుంజయ, గంగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 09, 2020
  Political News
Political News