Political News

మహిళలను గౌరవించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది – ఏఎస్పీ వెంకటరత్నం

నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటరత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నారని వారిని ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు.మహిళ అనేది లేకుంటే ప్రపంచంలో సృష్టి లేదన్నారు విద్యార్థులు యువతులు భయాందోళనలు వదిలి అన్ని రంగాలలో ముందుకు అడుగు వేయాలని కోరారు. అనంతరం కష్టమ్స్ సూపరింటెండెంట్ ఉషా కిరణ్ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా మహిళల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.అన్ని రంగాలలో మహిళలు ఎన్ని రంగాలలో వున్నా దాడులు జరుగుతూనే ఉన్నాయని వాటిని అరికట్టేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. హరిప్రియ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలి అన్నారు ఈ కార్యక్రమానికి సామ్నా అధ్యక్షుడు సర్వేపల్లి రామ్మూర్తి సంఘం అధ్యక్షులు సర్వేపల్లి రామ్మూర్తి అధ్యక్షత వహించారు.ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళా దినోత్సవాన్ని 10 సంవత్సరాలనుండి జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాటేటి రత్న ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం హనోక్, కోశాధికారి విజయ్ కుమార్,గౌరవ అధ్యక్షులు రామారావు ఉపాధ్యక్షులు సుబ్బారావు, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 07, 2020
  Political News
Political News